కొద్దిరోజులుగా సమంత, దర్శకుడు రాజ్ నిడమోరు తో డేటింగ్ లో ఉంది అనే వార్తలు ఎప్పటికప్పుడు గుప్పుమంటూనే ఉన్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టుగా సమంత-రాజ్ నిడమోరు కలిసి వెకేషన్ కి వెళ్లడం, టెంపుల్స్ చుట్టూ తిరగడం అంతేకాదు.. ముంబై లో తరచూ కలిసి కనిపించడంతో వీరి డేటింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరోపక్క రాజ్ నిడమోరు వైఫ్ కూడా వీరి బంధంపై ఇండైరెక్ట్ గా పోస్ట్ లు పెట్టడం హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అయితే సమంత ఈ డేటింగ్ రూమర్స్ పై ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వడం లేదు. ఎప్పటికప్పడు తనపై వచ్చే రూమర్స్ కు చెక్ పెట్టే సమంత రాజ్ విషయంలో సైలెన్స్ ని మైంటైన్ చేస్తుంది.
తాజాగా సమంత-రాజ్ నిడమోరు ముంబైలో ఒకే కారులో కనిపించడం చర్చనీయాంశం అయ్యింది. వీరిద్దరూ ముంబై లోని టాప్ రెస్టారెంట్ కి డిన్నర్ డేట్ కి వెళ్ళినట్లుగా టాక్ వినబడుతుంది. ఆతర్వాత కలిసి వారి ఇళ్లకు వెళ్ళేటప్పుడు ఒకే కారులో వెళుతున్నప్పుడు మీడియాకి చిక్కారు. వారిద్దరూ కారులో ప్రయాణించిన వీడియోస్ వైరల్ గా మారాయి.