Advertisementt

మహేష్ బర్త్ డే ని లైట్ తీసుకుంటున్న జక్కన్న

Thu 31st Jul 2025 10:08 AM
mahesh babu  మహేష్ బర్త్ డే ని లైట్ తీసుకుంటున్న జక్కన్న
Mahesh Babu birthday update మహేష్ బర్త్ డే ని లైట్ తీసుకుంటున్న జక్కన్న
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కి కేవలం అంటే కేవలం తొమ్మిదిరోజులు సమయం ఉంది. మహేష్ లేటెస్ట్ మూవీ రాజమౌళి దర్శకత్వంలో మొదలై అప్పుడే ఏడు నెలలు కావొస్తుంది. రాజమౌళి మాత్రం సైలెంట్ గా తన పని తను చేసుకుంటున్నారు కానీ.. మహేష్ బర్త్ డే విషయంలో సీరియస్ గా లేరనేది ప్రస్తుతం మహేష్ అభిమానులను డిజప్పాయింట్ చేస్తున్న న్యూస్. 

మహేష్ బర్త్ డే కి రాజమౌళి ఎలాంటి ప్రెస్ మీట్ కానీ, ప్రమోషనల్ కంటెంట్ కానీ వదిలే ఉద్దేశ్యంలో లేరనేది సన్నిహితుల సమాచారం. రాజమౌళి అభిమానుల కోసం హడావిడిగా ఏదైనా అప్ డేట్ ఇచ్చే రకం కాదు, ఆయన ఆచి తూచి మరీ మహేష్ మూవీ అప్ డేట్ ను వదిలే రకం. అభిమానులు ఆశపడుతున్నారు, ఆరాటపడుతున్నారనేది రాజమౌళికి అనవసరం. 

మహేష్ అభిమానులకు ఆగష్టు 9 న నిరాశ తప్పదనే వార్త వైరల్ అవుతుండగా.. రాజమౌళి మాత్రం మహేష్ తో సినిమా హాలీవుడ్ రేంజ్ లో పాపులర్ అవ్వాలని, అందుకే ఎలాంటి ప్రమోషన్స్ ఇప్పటినుంచి చెయ్యకుండా, కనీసం ఓపెనింగ్ వీడియో కూడా ఇవ్వకుండా వెయిట్ చేస్తున్నారని, హాలీవుడ్ మీడియా సంస్థలతో కొలాబ్రేట్ అయ్యాకే మహేష్ మూవీ పై అప్ డేట్ అయినా ప్రెస్ మీట్ అయినా అని ఆలోచిస్తున్నారట. 

సో ఆగష్టు 9 సూపర్ స్టార్ బర్త్ డే కి రాజమౌళి నుంచి ఎలాంటి ట్రీట్ ఆశించవద్దనేది సోషల్ మీడియా సలహా. చూద్దాం అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో అనేది. 

Mahesh Babu birthday update:

Will Mahesh Babu Fans Get An SSMB29 Update On His Birthday

Tags:   MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ