పాపలర్ నిర్మాత దేశ విదేశాల్లో ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదిగారు. ఆటోమొబైల్ విడిభాగాల పరిశ్రమలో రాణించి ఏకంగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించాడు. పారిశ్రామిక వేత్తగా ఎదురే లేని స్థాయి అతడిది. అయితే అతడి ఆకస్మిక మరణం పెద్ద ట్విస్ట్. అతడికి మూడు పెళ్లిళ్లు జరగడం, అందులో మొదటి భార్యతో ఖరీదైన విడాకుల వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది.
అతడు మొదటి భార్యకు విడాకులివ్వడానికి కారణం.. హీరోలతో ఎఫైర్లు సాగించేడమేనని గుసగుసలు ఉన్నాయి. సదరు నిర్మాత మొదటి భార్య ప్రస్తుతం పరిశ్రమలో అగ్ర హీరోగా ఉన్న ఒకప్పటి యువహీరోతో డేటింగ్ చేసింది. కొన్నేళ్ల తర్వాత అతడి నుంచి విడిపోయి, ప్రముఖ మోడల్ కం నటుడితో మరోసారి డీప్ గా ప్రేమలో పడింది. ఆ ఇద్దరూ కలిసి ఒక కంపెనీని కూడా ప్రారంభించి భాగస్వాములుగా కొనసాగారు. ఆ సమయంలో ఒకే చోట సహజీవనం సాగించారు. కానీ వారి మధ్య కూడా బ్రేకప్ అయింది.
అటుపైనా ఆమె ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా వెలుగుతున్న మరో యువహీరోతో ప్రేమలో పడింది. ఇక ఆ హీరో ఆమెకు ప్రపోజ్ చేసిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ ప్రపోజల్ కి ఓకే అన్న తర్వాత ఈ జంటకు నిశ్చితార్థం కూడా అయింది. కానీ కాలం పరీక్షలో ఈ ప్రేమాయణం కూడా నిలవలేదు. ఈ జంట నిశ్చితార్థం తర్వాత రెండేళ్లకు విడిపోయారు. ఇది నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా అగ్ర నిర్మాత వైఫ్ ముగ్గురు హాట్ హీరోలతో ఎఫైర్ సాగించడం మీడియాలో ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఎవరు ఎవరితో ఎఫైర్ సాగించారు? అనేది అప్రస్తుతం. హిందీ చిత్రసీమలో ఇలాంటి విచిత్రాలు ఇంకెన్నో.