రౌడీ హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో చేసిన కింగ్ డమ్ నేడు జులై 31 న పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జెర్సీ తో తెలుగులోనే కాదు హిందీలోనూ కేజ్ సంపాదించుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్ డమ్ చిత్రంపై మొదటినుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, సత్య దేవ్ పవర్ ఫుల్ రోల్ ఇవన్నీ కింగ్ డమ్ కి ఆకర్షణగా కనిపించాయి.
టికెట్ బుకింగ్స్ లో జోరు చూపించిన ఓవర్సీస్ లో కింగ్ డమ్ షోస్ ఇప్పటికే పూర్తి కావడంతో అక్కడి ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కింగ్ డమ్ పై తమ స్పందనను తెలియజేస్తున్నారు. కింగ్ డమ్ ఓవర్సీస్ టాక్ లోకి వెళితే...
కింగ్ డమ్ విజయ్ దేవరకొండ కు పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చింది. అనకొండలా విజయ్ తిరిగొచ్చాడు, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అన్నదమ్ముల మద్యన సంఘర్షణను, అనుబంధాన్ని అద్భుతంగా చూపించాడు. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ఇద్దరూ పోటాపోటీగా పెరఫామ్ చేసారు.. కింగ్ డమ్ విజయ్ దేవరకొండను టాప్ లో నిలబెట్టడం ఖాయమంటూ చాలామంది ఆడియన్స్ కింగ్ డమ్ చూసి సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు.
సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టాడు.. సినిమా ప్రారంభమయిన కొద్ధి క్షణాల్లోనే కథలో లీనమయ్యేలా చేసాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ ఎంత బలంగా ఉందొ.. అంతే బలంగా సెకండ్ హాఫ్ ని చూపించారు. కథ పక్కదారి పట్టకుండా దర్శకుడు చేసిన ప్రయత్నం మెచ్చుకోవాలి. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్, BGM సినిమాకి ప్రధాన బలం. టెక్నీకల్ గా కింగ్ డమ్ కి పూర్తి మార్కులు వెయ్యొచ్చు అంటూ ఓవర్సీస్ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు.
అంతటా పాజిటివ్ రివ్యూస్ కనిపించినా.. ఫస్ట్ హాఫ్ అంత బలంగా సెకండ్ హాఫ్ లేదు, క్లైమాక్స్ కూడా డిజప్పాయింట్ చేసింది, కొన్ని సీన్స్ కన్నడ బ్లాక్ బస్టర్ KGF, ప్రభాస్ సలార్ ను గుర్తు తెస్తున్నాయంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరి కింగ్ డమ్ అసలు కథ ఏమిటి అనేది మరికాసేపట్లో రివ్యూలో చూసేద్దాం.