మెగాస్టార్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ విశ్వంభర. ఎప్పుడో సంక్రాంతికి వచ్చేస్తుందనుకున్న సినిమా నేటికీ విడుదల తేదీ ప్రకటించడంలో వెనకడుగు వేస్తూనే వస్తుంది. విఎఫెక్స్ వర్క్ అంటూ నెలల తరబడి చెక్కుడు కార్యక్రమం జరుగుతూనే ఉంది. కాగా ఇటీవల విడుదలైన హరి హర వీరమల్లు దెబ్బతో విశ్వంభరకి డేంజర్ బెల్ సౌండ్ మరింత పెరిగింది.
హరి హర వీరమల్లు లో నాసిరకం గ్రాఫిక్స్, స్క్రీన్ షాట్స్ బాలేవంటూ సోషల్ మీడియా వేదికగా వీరమల్లుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మాములు హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ సినిమాకే ఈ రేంజ్ విమర్శలొచ్చాయంటే పూర్తిగా గ్రాఫిక్స్ పైనే డిపెండ్ అయిన సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర కు ఈ సెగ మరింత గట్టిగా తగులుతుంది అనడంలో సందేహం లేదు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయినా.. నాసిరకం అవుట్ ఫుట్ ఆన్ స్క్రీన్ పై కనిపించినా విమర్శల జడివాన తుఫానుగా మారే ప్రమాదముంది.
అందుకే చెబుతున్నాం విశ్వంభరకు గట్టిగా మోగుతున్నాయి డేంజర్ గంటలు అని. ఇక్కడ దర్శకుడు జ్యోతి కృష్ణ ను బ్లేమ్ చేసినట్టు రేపు దర్శకుడు వసిష్ఠ విమర్శల సుడిగుండంలో చిక్కుకోకూడదు అనుకుంటే తప్పదు చాలా కష్టపడాలి. చూద్దాం కొన్ని నెలలుగా వసిష్ఠ విశ్వంభర విఎఫెక్స్ పనుల్లోనే తలమునకలై ఉన్నారు. అందుకే విడుదల తేదీ కూడా ఇవ్వకుండా మెగా ఫ్యాన్స్ ను వెయిట్ చేయిస్తున్నారు.