ఆగష్టు 14 న బాక్సాఫీసు దగ్గర కొట్లాటకు దిగబోతున్న కూలి, వార్ 2 చిత్రాల్లో ఏ చిత్రానికి ఎక్కువ హైప్ ఉంది, ఏ చిత్రాన్ని యూత్ లైక్ చేస్తున్నారనే విషయంలో చాలామందిలో చాలా క్యూరియాసిటీ నడుస్తుంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్, సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ, నాగార్జున విలన్, ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్, ఉపేంద్ర కీలక పాత్ర.. మరిన్నో విశేషాలతో కూలి రాబోతుంది.
మరోపక్క హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కలయికలో స్పై యూనివర్స్ వార్ 2. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ హీరోయిజం, వారి నడుమ యాక్షన్ సన్నివేశాలు హైలెట్ అవడమే కాకుండా కియారా అద్వానీ గ్లామర్ షో. వార్ 2 కి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చెయ్యడానికి ఏమి లేవు అనేది కొంతమంది వాదన.
లోకేష్ కనగరాజ్ పాత సినిమాలను పరిశీలిస్తే.. లోకేష్ ఏ సినిమాని ఎలా తెరకెక్కిస్తారో అనేది ఊహకు కూడా అందదు. నాగార్జున ను విలన్ గా ఎలా చూపించబోతున్నారు, సూపర్ స్టార్ ని ఎలా చూపిస్తారో అనేది ఆగష్టు 2 వ తారీఖున రాబోయే కూలి ట్రైలర్ వస్తే క్లారిటీ వస్తుంది.
ఇంతా బయట టాక్ ను బట్టి వార్ 2 కన్నా ఎక్కువగా కూలి కోసమే చాలామంది మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారనేది వాస్తవం.