బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మనీలాండరింగ్ వ్యవహారం జరిగినట్లు అధికారులు అనుమానిస్తూ.. పలువురు సెలబ్రిటీస్ ని ఈడీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ తదితరులకు ఈడీ నోటీసులు ఇవ్వగా రానా, విజయ్ దేవరకొండలు మరోరోజు విచారణకు గడువు కావాలని కోరారు.
ఇక నేడు ప్రకాష్ రాజ్ ను ఈడీ విచారణకు పిలవగా ప్రకాష్ రాజ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ లో ఉన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి విచారణ కొరకు చేరుకున్నారు. ప్రస్తుతం అధికారులు ప్రకాష్ రాజ్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు.. ఈడీ అధికారులు ఇటీవల నోటీసులు పంపించారు.