మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కి అనుకోని అదృష్టం బంకలా తగులుకున్నట్టుగా టాలీవుడ్ యంగ్ హీరోలంతా భాగ్యశ్రీ బోర్సే చుట్టూనే తిరుగుతున్నారు. అందులో భాగ్యశ్రీ బోర్సే కి శ్రీలీల రూపంలో అనుకోని లక్కు తగులుతూ వచ్చింది. ఆమె తప్పుకున్న రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ భాగ్యశ్రీ బోర్సే చెంతకు చేరాయి. ప్రస్తుతం ఆమె నటించిన కింగ్ డమ్ రేపు జులై 31 న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
ఈ చిత్ర రిజల్ట్ కోసం చాలామంది హీరోలు వెయిట్ చేస్తున్నారు. కారణం భాగ్యశ్రీ బోర్సే కి యంగ్ హీరోలు హిట్ తో సంబంధం లేకుండా అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు ఆమె నటించిన కింగ్ డమ్ విడుదలైతే వాళ్ళ సినిమాలకు క్రేజ్ వస్తుంది. అదే వాళ్ళ వెయిటింగ్ కి కారణం. కింగ్ డమ్ ప్రమోషన్స్ లో గ్లామర్ షో చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే అదృష్టమెలా ఉందో రేపు డిసైడ్ అవుతుంది.
రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా, అఖిల్ లెనిన్, వీటితో పాటుగా కింగ్ డమ్ హిట్ అయితే ఆమెకి మరిన్ని అవకాశాలు ముఖ్యంగా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ప్యారడైజ్ లో అవకాశం వచ్చేలా ఉంది. మరి కింగ్ డమ్ రిజల్ట్ కోసం హీరోలు ఎదురు చూపులు అనేది అందుకే. అది వర్కౌట్ అయితే స్టార్ హీరోల చూపు అమ్మడు పై పడొచ్చు.