టాలీవుడ్ లో ప్రముఖ దర్శకనిర్మాత, దాసరి నారాయణరావు ఆస్తుల కోసం, వారసుల కొట్లాట గురించి ఆయన జీవించి ఉన్న రోజుల్లోనే చాలా చర్చ సాగింది. కొడుకుతో కోడలు బహిరంగ పోరాటం కూడా ఆయన మర్యాదకు భంగం కలిగించింది. అయితే ఆస్తి తగాదాలు ఎప్పుడూ భిన్నంగా లేవు. ఆస్తుల కోసం కొట్టాడేది ఎప్పుడూ అయినవారే.. దగ్గర బంధువులే.
ఇప్పుడు అంతకుమించి అయినవారితో పెద్ద గొడవ ఇది. దాదాపు 30వేల కోట్ల ఆస్తికి సంబంధించిన వివాదం చర్చగా మారింది. ఇది ఇటీవల గుండెపోటుతో మరణించిన నిర్మాత కం పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్ ఫ్యామిలీలో వివాదం. అతడి తల్లికి, భార్యకు మధ్య వర్గ పోరు నడుస్తోంది. దివంగత సంజయ్ కపూర్ ఫ్యామిలీలో 30వేల కోట్ల ఎస్టేట్- సోనా కామ్ స్టార్ కంపెనీకి చెందిన వివాదం అంతకంతకు ముదురుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సంజయ్ మరణించాక అతడి ప్రస్తుత భార్య ప్రియా సచ్ దేవ్ బోర్డ్ డైరెక్టర్లలో ఒకరిగా నియమితులయ్యారు. ఆమె ఇన్ స్టా బయో ప్రియా సచ్ దేవ్ కపూర్ నుంచి ప్రియా సంజయ్ కపూర్ కి మారడం ఆశ్చర్యపరిచింది.
ఇక కొడుకు సంజయ్ మరణానంతరం తనకు ఇష్టం లేకపోయినా కొన్ని పత్రాలపై సంతకాలు చేయాల్సి వచ్చిందని సంజయ్ తల్లి రాణీ కపూర్ నర్మగర్భంగా వ్యాఖ్యానించడం ఆశ్చర్యపరిచింది. ఎవరికి వారు ఈ ఆస్తులకు వారసులం అంటూ ముందుకు వస్తున్నారని ఆమె వాపోతున్నారు. కోడలు వైపు నుంచి బంధువుల ఒత్తిడిపైనా రాణీకపూర్ అసంతృప్తిగా ఉన్నారు. రాణీ కపూర్ కి సంజయ్ తో పాటు మునుపటి భర్తతో కుమార్తె కూడా ఉన్నారు.
ఇక సంజయ్ 30 వేల కోట్ల ఆస్తులతో అతడి మునుపటి భార్యలకు ఎలాంటి సంబంధం లేదు. మాజీ భార్యలు, వారి పిల్లలకు అతడు ముందే ఆస్తులు రాసిచ్చాడు. నందిత మహ్తానీ నుంచి విడిపోయిన సంజయ్ కపూర్ ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ ని పెళ్లడారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరిష్మాకు సంజయ్ ఆస్తులు బదలాయించాడు. కరిష్మా నుంచి విడిపోయాక, అతడు మోడల్ కం నటి ప్రియా సచ్ దేవ్ ని పెళ్లాడాడు. ప్రియాకు కూడా పిల్లలు ఉన్నారు. సోనాకామ్ స్టార్ - ఎస్టేట్ ఆస్తులపై కుటుంబ సభ్యుల పోరాటంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.