సమంత ఫిట్ నెస్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆమె సోషల్ మీడియా లో షేర్ చేసే వీడియోస్ చూస్తే తెలుస్తుంది. బాదొచ్చినా, లేదంటే సంతోషమొచ్చినా ఆమె ఎక్కువగా జిమ్ లోనే గడుపుతుంది. ప్రస్తుతం మయోసిటిఎస్ వ్యాధి తో సఫర్ అవుతున్న సమంత జిమ్ ని మాత్రం రెగ్యులర్ గా చేస్తుంది.
అయితే ఆమె ఎక్కువగా జిమ్ చెయ్యడం వలనో లేదంటే డైట్ మైంటైన్ వలనో తెలియదు కానీ సమంత బాగా బరువు తగ్గిపోయి కనిపిస్తుంది. తాజాగా సమంత జిమ్ లో చేసిన ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా బాగా పాపులర్ అయిన 90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను సమంత స్వీకరించింది.
సమంత తన శారీరక బలాన్ని ప్రదర్శించి 90 సెకన్ల పాటు బార్‌కు వేలాడుతున్న ఆ కష్టతరమైన ఛాలెంజ్‌ను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసింది. ఆ వీడియో ను షేర్ చేస్తూ.. చేతులు పూర్తిగా చాచి, పాదాలను 90 సెకన్ల పాటు వేలాడదీసి పుల్-అప్ బార్ నుండి వేలాడదీయడానికి ప్రయత్నించాను.. అందులో సక్సెస్ కూడా అయ్యానని సమంత చెప్పుకొచ్చింది.