పవన్ కళ్యాణ్ గత రెండేళ్లుగా సిల్వర్ స్క్రీన్ పైనే కనిపించలేదు. బ్రో తర్వాత ఆయన ఈ ఏడాది రెండు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ విడుదలకు రెడీ చేసారు. హరి హర వీరమల్లు, OG షూటింగ్స్ పూర్తి చెయ్యడమే కాదు పవన్ కళ్యాణ్ వీరమల్లు ను థియేటర్స్ లో దించేశారు. ఇక మరో రెండు నెలల్లో OG ని విడుదల చెయ్యడానికి రెడీ అయ్యారు.
మరోపక్క హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ షూట్ ని ఫినిష్ చేసేసారు. పవన్ కళ్యాణ్ స్పీడు చూస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా ఈ ఏడాది థియేటర్స్ లో రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు అనేది చాలామంది మాట్లాడుకుంటున్న మాట. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ పూర్తి చెయ్యడమే కాదు సినిమాలను అలానే విడుదల చేసేలా ఉన్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని పవన్ కళ్యాణ్ పూర్తి చేసారు అంటే.. దర్శకుడు హరీష్ శంకర్ ఆఘమేఘాల మీద పోస్ట్ ప్రొడక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అన్నా షాకవ్వక్కర్లేదు. చూద్దాం పవన్-హరీష్ ల ప్లాన్ ఎలా ఉందొ అనేది.