మెగాస్టార్ చిరంజీవి యూత్ తో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వసిష్ఠ తో విశ్వంభర షూటింగ్ ని ముగించిన ఆయన, మొన్న మే నుంచి అనిల్ రావిపూడి తో మెగా 157 చిత్ర షూటింగ్ చేస్టున్న మెగాస్టార్ తన తదుపరి చిత్రాలను కూడా లైన్ పెట్టేసుకున్నారు. అది శ్రీకాంత్ ఓదెల తో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని చిరు అనౌన్స్ చేసారు.
నాని నిర్మాతగా చిరు-ఓదెల కాంబో ఎలా ఉండబోతుందో ప్రీ లుక్ పోస్టర్ తోనే రివీల్ అయ్యింది. ఇక మరోసారి బాబీ కొల్లి మెగాస్టార్ ని డైరెక్ట్ చెయ్యబోతున్నారు. గతంలో వారి కాంబోలో వాల్తేర్ వీరయ్య వచ్చింది. అది హిట్ అయ్యింది. ఆతర్వాత వీళ్ళ కలయికలో మరో మూవీ రాబోతుంది అన్నారు. అది ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. దర్శకుడు బాబీ కొల్లి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా స్టోరీ, స్క్రిప్ట్ రెండూ సిద్ధం చేస్తున్నారట.
బాబీ-మెగాస్టార్ చిరు కాంబో కి పూనకాలు లోడింగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది, ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ లో అలా మొదలుపెట్టి వచ్చే వేసవికి అంత పూర్తి చేయాలనే లక్ష్యంతో బాబీ - చిరు మూవీ పనులు ప్లాన్ చేస్తున్నారట. సో మెగాస్టార్ మెగా లైనప్ మాములుగా లేదన్నమాట.