గత వారం విడుదలైన హరి హర వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది. కానీ వీరమల్లు ఏ విధంగానూ బాక్సాఫీసు ని స్ట్రాంగ్ గా నిలబెట్టలేకపోయింది. ఇక ఇప్పుడు బాక్సాఫీసు భారం మొత్తం విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మొయ్యాల్సి ఉంది. పాన్ ఇండియా మూవీ గా ఈ గురువారం కింగ్ డమ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది.
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్ డమ్ మూవీనే విజయ్ దేవరకొండ ను ఒడ్డున పడెయ్యాలి. వరస వైఫల్యాలతో ఉన్న విజయ్ కి కింగ్ డమ్ హిట్ అత్యంత అవసరం. మరి దాదాపుగా 100 కోట్ల గ్రాస్ లక్ష్యంతో బరిలో దిగుతోంది. ఈ వారం పెద్దగా పోటీ కూడా లేకపోవడం కింగ్ డమ్ కి ప్లస్ అవ్వనుంది.
కింగ్ డమ్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే..
నైజాం 15 కోట్లు
సీడెడ్ 6 కోట్లు
ఆంధ్ర 15 కోట్లు
కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలు 3.5 కోట్లు
ఓవర్సీస్ 10 కోట్లు
మిగతా డబ్బింగ్ వెర్షన్లు 4 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తుంది. మరి కింగ్ డమ్ అటు ఇటుగా 55 కోట్ల దాకా తెస్తేనే నిర్మాతలు ఒడ్డున పడతారు.. లేదంటే అనేది మరో రెండు రోజులు వెయిట్ చేస్తే సరి.