మెగాస్టార్ చిరంజీవి-వసిష్ఠ కలయికలో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్ర షూటింగ్ రీసెంట్ గానే స్పెషల్ సాంగ్ చిత్రీకరణతో పూర్తయ్యింది. ప్రస్తుతం సిజి వర్క్, పోస్ ప్రొడక్షన్ వర్క్ లో దర్శకుడు వసిష్ఠ బిజీగా వున్నాడు. మెగాస్టార్ చిరు తో బాలీవుడ్ నాగిని అదేనండి మౌని రాయ్ విశ్వంభర స్పెషల్ సాంగ్ కి కాలు కదిపింది.
ముందుగా ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ని అనుకున్నారట. కానీ ఆమె భారీగా అంటే దాదాపుగా 8 కోట్ల పారితోషికం ఒక్క పాట కోసమే డిమాండ్ చెయ్యగా.. మేకర్స్ సైలెంట్ గా మౌని రాయ్ తో పని కానిచ్చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఈ స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసినందుకు గాను మౌని రాయ్ కి విశ్వంభర మేకర్స్ 50 లక్షలు పారితోషికం ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
త్రిష మెయిన్ హీరోయిన్ గా అషిక రంగనాధన్, సురభి లాంటి హీరోయిన్ కీ రోల్స్ చేస్తున్న విశ్వంభర చిత్రంలో ఈ నాగిని స్పెషల్ సాంగ్ హైలెట్ అవుతుంది అంటున్నారు. మరి వసిష్ఠ విశ్వంభర రిలీజ్ తేదీ ఎప్పుడిస్తారో అని మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.