కొన్నిసార్లు మనుషులతో స్నేహం చేసేందుకు మూగజీవాలు తహతహలాడతాయి. అలాంటి ఒక అరుదైన సన్నివేశం అనన్య పాండేకు ఎదురైంది. ఈ భామ ప్రస్తుతం రాజస్తాన్‌లో కార్తీక్ ఆర్యన్ తో కలిసి షూటింగ్ లో బిజీగా ఉంది. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక నెమలి అనన్య ఉన్న ప్లేస్‌కి వచ్చింది. తన పక్కనే వాలి అది కాస్త భయపెడుతూ కనిపించిందట. నెమలి ప్రవర్తనకు తాను భయపడ్డానని అనన్య పాండే చెబుతోంది.
తన జీవితంలో భయానక క్షణాన్ని ఎదుర్కొన్నానని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. నెమలికి చేరువగా ఉన్న ఓ రెండు ఫోటోలను కూడా అనన్య షేర్ చేసింది. అయితే ఆ రెండో ఫోటోలో మాత్రం అందమైన నెమలి శాంతించి కనిపించింది. చూస్తుంటే ఆ ఇద్దరి ఫ్రెండ్షిప్ కూడా ఆకర్షిస్తోంది.
`పతి పత్ని ఔర్ వో` తర్వాత కార్తీక్‌తో కలిసి అనన్య రెండోసారి నటిస్తోంది. `తు మేరీ మై తేరా, మై తేరా తు మేరీ` అనే పొడవాటి టైటిల్ ని ఎంపిక చేసారు. ప్రేమికులరోజు కానుకగా ఈ చిత్రం 13 ఫిబ్రవరి 2026న విడుదల కానుంది. ఈ ప్రేమకథా చిత్రానికి సమీర్ విద్యాన్ దర్వకత్వం వహిస్తున్నారు.