ఈరోజు జులై 28 న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బర్త్ డే. దుల్కర్ సల్మాన్ మహానటి, లక్కీ భాస్కర్, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు. హ్యాండ్ సమ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్. తెలుగులో రానా ప్రొడక్షన్ లో కాంత చిత్రంలో నటిస్తున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా కాంత టీజర్ ని వదిలారు మేకర్స్.
1950లో మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన నాటకీయ థ్రిల్లర్ గా కాంత తెరకెక్కుతోంది. దుల్కర్, సముద్రఖని నడుమ సాగే ఉత్కంఠ భరితమైన డ్రామా గా కాంత చిత్రం ఉండబోతుంది అనేది టీజర్ లో స్పష్టతనిచ్చారు. హీరో-హీరోయిన్ అన్ని నువ్వే అంటూ భాగ్యశ్రీ బోర్సే కీలకంగా సముద్రఖని మొదలుపెట్టిన శాంత చిత్రాన్ని అన్ని తానై దుల్కర్ సల్మాన్ గ్రిప్ లోకి తెచ్చుకుని సముద్రఖనికి షాకిస్తూ ఇది శాంత కాదు కాంత అంటూ చెప్పే డైలాగ్ టీజర్ కి హైలెట్ గా నిలుస్తుంది.
అంతేకాదు 1950లో నటులు ఎలా ఉండేవారో అలాంటి లుక్స్ లోనే ఈ చిత్ర పాత్రలను కాంత లో చూపించబోతున్నారు. దుల్కర్ లుక్స్ మహానటిలోని జెమిని గణేష్ పాత్రని గుర్తు చేసాయి. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నటుడు సముద్రఖని లుక్స్ అన్ని కాంత టీజర్ లో సూపర్బ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా వున్నాయి.