దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు చిత్రాన్ని ఆరంభించి ఓ 70 శాతం మేర షూటింగ్ పూర్తి చేసాక ఆయన హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. జ్యోతికృష్ణ మిగతా షూటింగ్ పూర్తి చేసారు. రీసెంట్ గా విడుదలైన హరి హర వీరమల్లు ఫస్ట్ హాఫ్ బావుంది. అది క్రిష్ డైరెక్ట్ చేసి ఉంటారు అని అందరూ క్రిష్ ని మెచ్చుకున్నారు.
అయితే క్రిష్ కథ వేరే ఉంది.. అది హరి హర వీరమల్లు పార్ట్2 లో ఉంటుంది. నేను ఫస్ట్ పార్ట్ లో స్టోరీని మార్పులు చేశాను, క్రిష్ అనుకున్న కోహినీర్ డైమండ్ కథ పార్ట్ 2 లో వస్తుంది. మేము తీసిన వీరమల్లు చిత్రం లో విఎఫెక్స్ బాలేదు అంటున్నారు, ప్రతి సినిమాకి ఏదో ఒకటి అంటారు. మా సినిమా ఫస్ట్ హాఫ్ బావుంది, సెకండ్ హాఫ్ బావుంది అంటున్నారు కానీ సినిమా బాలేదు అని ఎవరూ అనలేదు అంటూ జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చారు.
అదిచూసి వారు హరి హర వీరమల్లు ఫస్ట్ పార్ట్ లో ఫస్ట్ హాఫ్ బావుంది అంటూ అందరూ క్రిష్ కి క్రెడిట్ ఇచ్చారు, అందుకే క్రిష్ పేరు చెప్పి పార్ట్ 2 మిగతా షూటింగ్ పూర్తి చేసి వదిలితే మళ్లీ ఆడియన్స్ హరి హర వీరమల్లు 2 చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అందుకే క్రిష్ పేరు ని జ్యోతికృష్ణ ఇలా వాడారంటూ కామెంట్స్ చేస్తున్నారు.