ఆగష్టు 9 వచ్చేస్తుంది. మహేష్ బాబు బర్త్ డే కి మరొక్క పది రోజుల సమయమే ఉంది. ఈ పది రోజుల్లో ఎస్ ఎస్ రాజమౌళి మహేష్ అభిమానుల కోసం ఏం ప్లాన్ చేస్తున్నారు. గత ఏడు నెలలుగా SSMB 29 అప్ డేట్ ఇవ్వకుండా అభిమానులను వెయిట్ చేస్తున్న రాజమౌళి మహేష్ బర్త్ డే ట్రీట్ ఇస్తారని ఆశపడ్డారు.
కానీ రాజమౌళి కాంపౌండ్ నుంచి ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. అసలు సూపర్ స్టార్ బర్త్ డే కి రాజమౌళి ఏమైనా ట్రీట్ ప్లాన్ చేస్తున్నారా, ఇప్పటికైనా SSMB 29 అప్ డేట్ ఇస్తారా అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్న గుసగుసలు మహేష్ అభిమానులను ఆందోళన పెడుతున్నాయి. మరి ఈ పది రోజుల్లో మహేష్ బర్త్ డే కి రాజమౌళి ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారో తెలియదు కానీ మహేష్ అభిమానుల్లో ఆత్రుత మాత్రం ఎక్కువైపోతోంది.
ప్రస్తుతం రాజమౌళి బాహుబలి రీ రిలీజ్ పనుల్లో ఉన్నారు. మహేష్ ఫ్యామిలీతో శ్రీలంక వెకేషన్ లో ఉండగా పృథ్వీ రాజ్ ఆయన సినిమాల ప్రమోషన్స్ లో ఉన్నారు. ప్రియాంక చోప్రా ఫ్యామిలీ వెకేషన్ లో ఉంది. ఆగష్టు నుంచి SSMB 29 కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది.