విజయ్ దేవరకొండ-రష్మిక నడుమ సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తుంది అనే మాట గత రెండు రోజులుగా తెగ వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాడు, రష్మిక సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ ను నువ్వు మాములోడివి కాదు అంటోంది.
విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా రష్మిక మందన్న కింగ్ డమ్ ట్రైలర్ ని వీక్షించిన ఆమె.. సోషల్ మీడియా వేదికగా నువ్వు(విజయ్ దేవరకొండ) నిజంగా అద్భుతం. నేను నీలా 50 శాతం నటించగలిగితే బాగుండు, ఈ ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నాలుగు రోజుల నుంచి వెయిటింగ్.. నేనెప్పుడూ చెబుతుంటాను నువ్వు మామూలోడివి కాదని అంటూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
మరి ఇద్దరి మధ్యన ఫ్రెండ్ షిప్ బాండింగ్ అంటున్నారు కానీ.. నెటిజెన్స్ మాత్రం విజయ్ దేవరకొండ-రష్మిక మద్యన అంతకుమించిన బాండింగ్ ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు.