ఎప్పుడు గ్లామర్ షో చేసే సమంత ఇప్పుడు సింపుల్ గా శారీ లుక్ లో దర్శనమిచ్చింది. ఫ్లోరల్ ఆర్గన్జ శారీ లో బ్లాక్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో సమంత చాలా అందంగా కనిపించింది. ఈమధ్యన సమంత సన్నగా మారడానికి ఆమె తీసుకునే డైట్ కారణమనే వార్త బయటికొచ్చింది. మాయోసైటిస్ వలన ఆమె స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతుంది.
అటు డైట్ ఇటు ఆమె చేసే వర్కౌట్స్ కారణంగా సమంత నాజూగ్గా కాదు మరీ సన్నగా తయారైంది. ఆమె గ్లామర్ కాస్ట్యూమ్స్ లో మరీ పుల్లలా కనిపిస్తుంది, కాస్త లావుగా మారు, బరువు పెరుగు సమంత అంటూ ఆమె అభిమానులే అడుగుతున్నారు. కానీ ఆమె వ్యాధి వలన ఆమె అంత కష్టమైన డైట్ ని వర్కౌట్స్ ని ఫాలో అవుతుంది.
నటనకు గ్యాపిచ్చిన సమంత సినిమాలను నిర్మిస్తుంది. ఈమధ్యనే ఆమె నిర్మించిన శుభం హిట్ అవగా ఆమె ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ని నిర్మించేందుకు రెడీ అవుతుంది అనే వార్త వైరల్ అవుతుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించే సినిమాని ఆమె నిరించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.