దర్శకుడు వసిష్ఠ సడన్ గా మీడియా ముందుకొచ్చి ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో అందరూ ఇంకేమిటి విశ్వంభర సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ రిలీజ్ డేట్ వచ్చేస్తుంది అన్నారు. అంతేకాదు ఈలోపు విశ్వంభర స్పెషల్ సాంగ్ షూట్ పూర్తి అయ్యింది.. హిందీ నటి మౌని రాయ్ తో మెగాస్టార్ కాలు కదిపారు. ఈ సాంగ్ తో విశ్వంభర షూటింగ్ పూర్తయ్యింది అంటూ అప్ డేట్ ఇచ్చారు.
దానితో మెగా అభిమానులు రిలాక్స్ అయ్యారు. హమ్మయ్య ఇకపై విశ్వంభర రిలీజ్ తేదీ వచ్చేస్తుంది అని. కానీ విశ్వంభర కు సీజీ వర్క్ కూడా కంప్లీట్ అయ్యాకే విడుదల తేదీ అంటూ మేకర్స్ అనడం కాస్త నిరాశ పరిచినా.. మెగా ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లో విశ్వంభర సెప్టెంబర్ కాకపోయినా అక్టోబర్ కు వస్తుంది అనుకుంటే..
ఇప్పుడు విశ్వంభర డిసెంబర్ కి వెళ్లిపోవచ్చు.. అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో కనిపించగానే మెగా ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. డిసెంబర్ 5 రాజా సాబ్ వస్తోంది, మరి విశ్వంభర ఏమైనా క్రిష్టమస్ బరిలో దిగుతుందేమో చూడాలి.