ఇండియా 2 కి సీక్వెల్ గా శంకర్ - కమల్ హాసన్ కలయికలో రావాల్సిన ఇండియన్ 3 సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నాయి. యునియన్ 2 డిజాస్టర్ కావడం, శంకర్ కు నిర్మాతలు లైకా ప్రొడక్షన్ తో విభేదాలు ఉండడం, కమల్ హాసన్ ఇండియన్ 3 షూటింగ్ కొద్దిగా పూర్తి చెయ్యాల్సిన అవసరం ఉడడంతో ఇండియన్ 3 సినిమాపై రకరకాల ఉహాగానాలు ఊపందుకున్నాయి.
రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండియన్ 3 సమస్యలను పరిష్కరించడానికి రంగంలోకి దిగారనే వార్త రీసెంట్ గా వైరల్ అయ్యింది. అప్పటి నుంచి ఇండియన్ 3 తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇండియన్ 3 ని ఓటీటీలో రిలీజ్ చేస్తారనే రూమర్స్ ను శంకర్ గతంలో ఖండిస్తూ ఇండియన్ 3 ని థియేటర్స్ లోనే విడుదల చేస్తామని చెప్పారు.
తాజాగా భారతీయుడు 3 షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసి ఈ ఏడాది చివరిలో థియేటర్స్ లోకి తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినబడుతుంది. మరి అది సాధ్యమవుతుందా అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.