నితిన్-వేణు శ్రీరామ్ కలయికలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన తమ్ముడు చిత్రం జులై 5 న విడుదలై ఆడియన్స్ ని బాగా నిరాశపరిచింది. పలు దఫాలు వాయిదాపడుతూ ఫైనల్ గా జులై 5 న తమ్ముడు మంచి అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలైంది. కానీ ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేసింది.
నటి లయ తమ్ముడు చిత్రంతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ తమ్ముడు రిజల్ట్ లయ ను డిజప్పాయింట్ చేసింది. వరస ప్లాప్స్ లో ఉన్న నితిన్ కి తమ్ముడు కూడా షాకిచ్చింది. ఇక జులై 5 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసి ఆ తేదీనిఅధికారికంగా ప్రకటించారు. ఆగష్టు 1 నుంచి తమ్ముడు నెట్ ఫ్లిక్స్ నుంచి అందుబాటులో ఉండనున్నట్టుగా, తెలుగు సహా తమిళ్, ఇంకా కన్నడ, మళయాళ భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా ప్రకటించారు.