Advertisementt

సింగపూర్ లో చంద్రబాబు - లోకేష్

Sun 27th Jul 2025 01:36 PM
chandrababu  సింగపూర్ లో చంద్రబాబు - లోకేష్
Andhra CM Chandrababu Naidu lands in Singapore to woo investors సింగపూర్ లో చంద్రబాబు - లోకేష్
Advertisement
Ads by CJ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో హైదరాబాద్ ను సింగపూర్ సిటీగా మార్చాలనే కలను సాకారం చేసారు. అంతేకాదు అమరావతి నిర్మాణంలోనూ సింగవపూర్ కల్చర్ ఉండాలనుకున్నారు. అందుకే అక్కడ పెట్టుబడులు ఆకర్శించేందుకు చంద్రబాబు గతంలో చాలా కృషి చేసారు కానీ వైసీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధాని కాదంటూ మూడు రాజధానుల నినాదంతో సర్వనాశనం చేసారు. 

ఇప్పుడు ముఖ్యమంత్రిగా అమరావతి బాగు కోసం మరోసారి చంద్రబాబు నాయుడు తన మంత్రులతో కలిసి ఐదు రోజుల పర్యటన కోసం ఈ శనివారం రాత్రి సింగపూర్ బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు తో పాటుగా ఏపీ మంత్రులు మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, టీజీ భరత్‌ వెళ్లారు. ఆదివారం ఉదయం సింగపూర్ లోని షాంగ్రీ-లా హోటల్ వాలీ వింగ్‌లో భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు భేటీ అయ్యారు.

ఈ భేటీలో ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమి కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను చంద్రబాబు బృందం శిల్పక్ అంబులేకు వివరించారు. ఈ భేటీకి బాబు తో పాటుగా మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, టీజీ భరత్‌తో పాటు ఏపీ అధికారులు పాల్గొన్నారు. గతంలో సింగపూర్ తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు నుంచి సింగపూర్ తప్పుకుందని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులే తెలిపారు. 

అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలను, పెట్టుబడులకు గల అవకాశాలను శిల్పక్ అంబులేకు వివరించారు. మంత్రి నారా లోకేష్, చంద్రబాబు విడివిడిగా తమ తమ టీమ్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

Andhra CM Chandrababu Naidu lands in Singapore to woo investors:

Chandrababu Naidu arrives in Singapore for a five-day visit

Tags:   CHANDRABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ