టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ రేంజ్ కి చేరుకున్న విజయ దేవరకొండ ఎక్కువగా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. స్టేజ్ పై తనకు ఏది తోస్తే అది మట్లాడుతూ హైలెట్ అవుతూ ఉంటాడు. ఈమధ్యన ట్రైబల్స్ పై టెర్రరిజం విషయంలో చేసిన కామెంట్స్ కేసుల వరకు వెళ్ళింది. మరోపక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
తాజాగా కింగ్ డమ్ ప్రమోషన్స్ లో మరోసారి తగ్గేదేలే అంటూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గత సంవత్సర కాలంగా కింగ్‌డమ్ గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. టాప్ లోకి పోయి కూర్చుంటా.
ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు ఉంటే.. ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాను. జూలై 31న థియేటర్లలో కలుద్దాం అంటూ రాయలసీమ యాసలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అది చూసిన కొంతమంది కింగ్ డమ్ హిట్ కే టాప్ లోకి వెళ్తావా విజయ్.. నీకు వరస ప్లాప్ లు వస్తున్నా యాటిట్యూడ్ తగ్గలేదుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.