మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 లాంటి భారీ బడ్జెట్ స్పై యూనివర్స్ తో హిందీలోకి అడుగుపెడుతున్నారు.. అందులో హృతిక్ రోషన్ హీరో. మరి హిందీ డైరెక్టర్ అయాన్ ముఖర్జి అక్కడి స్టార్ హీరోకి హృతిక్ కి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇచ్చి ఎన్టీఆర్ ని తక్కువ చేస్తారేమో అనే అనుమానాలు తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఎక్కువయ్యాయి. కానీ వార్ 2 టీజర్ ఆ అనుమానాలను పటాపంచలు చేసింది. కానీ వార్ 2 టీజర్ పై సోషల్ మీడియాలో మిక్స్డ్ టాక్ వచ్చింది.
దానిని మేకర్స్ ట్రైలర్ తో కవర్ చేద్దామనుకున్నారు. ఎన్టీఆర్-హృతిక్ మధ్యన యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ కట్ వదిలారు. అభిమానులకు వార్ 2 ట్రైలర్ ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు వార్ 2 చిత్రం 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాదు.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి యష్ రాజ్ ఫిలిమ్స్ వారు ఏకంగా 70 కోట్ల పారితోషికం ఇచ్చారట.
స్టార్ హీరో హృతిక్ రోషన్ కి 50 కోట్లే పారితోషికమట. కాకపోతే వార్ 2 లాభాల్లో నిర్మాతలు హృతిక్ రోషన్ కు షేర్ ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నాడట. మరి అలా చూసుకున్నా హృతిక్ కన్నా ఎన్టీఆర్ కే ఎక్కువ. ఎన్టీఆర్ పారితోషికంతో పోలిస్తే హృతిక్ కే తక్కువ. సినిమా విడుదల కావాలి, లాభాలు రావాలి అప్పుడు దాని షేర్ గురించి మాట్లాడుకోవాలి అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాదన.
ఇక హీరోయిన్ కియారా అద్వానీకి 15 కోట్లు, మరో కీలక పాత్రధారి అనిల్ కపూర్ కు 10 కోట్లు. దర్శకుడు అయాన్ ముఖర్జీకి 30 కోట్ల దాకా పారితోషికాలు అందాయని తెలుస్తుంది.