కొద్దిరోజులుగా సైలెంట్ మోడ్ లో ఉన్న మృణాల్ ఠాకూర్ రీసెంట్ గా అడివి శేష్ డెకాయిట్ సినిమా సెట్ లో గాయపడింది అనే వార్త వైరల్ అయినా అది అధికారికంగా తెలియరాలేదు. తాజాగా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే ఆమె ఆరోగ్యంగా, ఎలాంటి గాయాలు లేకుండా ఫ్రెష్ గా కనిపించింది.
ట్రెడిషనల్ వేర్ లో మృణాల్ ఠాకూర్ కొత్త లుక్ నిజంగా బ్యూటిఫుల్ గా మెస్మరైజ్ చేసింది అనే చెప్పాలి. ఆ మోడ్రెన్ ట్రెడిషనల్ వేర్ లోనే మృణాల్ అందాలను అలవోకగా ఆరబొయ్యడమే కాదు కత్తిలాంటి ఫోజులతో మత్తెక్కించింది. ప్రస్తుతం సౌత్ లో ఆమె డెకాయిట్ చిత్రం మాత్రమే చేస్తుంది.
ఇక హిందీలో మృణాల్ ఠాకూర్ నటించిన సన్నాఫ్ సర్దార్ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఆ చిత్రం రిలీజ్ అయ్యాక మృణాల్ ఠాకూర్ హిందీ కెరీర్ ఏమిటి అనేది డిసైడ్ అవుతుంది.