మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ కి హీరోగానే కాదు దర్శకుడిగా కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేకాదు సలార్ లాంటి బిగ్ పాన్ ఇండియా ఫిలిం తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవడమే కాదు, లూసిఫర్ తో దర్శకుడిగా ఆయన బలమైన ముద్ర వేశారు. ప్రస్తుతం రాజమౌళి-మహేష్ కలయికలో తెరకెక్కుతున్న SSMB 29 లో ఆయన కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
అయితే పృథ్వీ రాజ్ కి ఇంత క్రేజ్ ఉంది. అలాంటి ఆయన హిందీలో బోమన్ ఇరానీ కొడుకు కయోజ్ ఇరానీ దర్శకత్వలో నటించిన సర్జమీన్ థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. అదే పృథ్వీ రాజ్ అభిమానులకు డిజప్పాయింట్ న్యూస్ అంటే ఆ చిత్రానికి వస్తోన్న ఫీడ్ బ్యాక్ చూసి ఆయన ఫ్యాన్స్ మరింత నిరాశపడిపోతున్నారు.
ఈ చిత్రంలో కాజోల్, సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా సర్జమీన్ తెరకెక్కగా ఈచిత్రం ఓటీటీ ఆడియన్స్ ను ఏ విధంగానూ మెప్పించలేకపోవడం చూసి.. విపరీతమైన డిమాండ్ ఉన్న హీరో ఇలాంటి డిజప్పాయింట్ సినిమాల్లో నటించడం అభిమానులకు కూడా సుతరామూ నచ్చడం లేదు.