Advertisementt

ఒక డెబ్యూ హీరోకి 300 కోట్లు

Sun 27th Jul 2025 03:58 PM
ahaan panday  ఒక డెబ్యూ హీరోకి 300 కోట్లు
300 crs for a debut hero ఒక డెబ్యూ హీరోకి 300 కోట్లు
Advertisement
Ads by CJ

ర‌ణ‌బీర్ క‌పూర్, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, అభిషేక్ బ‌చ్చ‌న్, శివ‌రాజ్ కుమార్, .. వీరంతా లెజెండ‌రీ న‌టుల కుటుంబాల‌ నుంచి వ‌చ్చిన‌ న‌ట‌వార‌సులు. తండ్రుల లెగ‌సీని ముందుకు న‌డిపించ‌డానికి చాలా శ్ర‌మ‌ప‌డాల్సి వ‌చ్చింది. రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్ కెరీర్ ప‌రంగా నిల‌దొక్కుకునేందుకు స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డింది అని నిరూపించేందుకు దాదాపు 12 సినిమాలు చేయాల్సి వ‌చ్చింది. కెరీర్ లో రెండో సినిమానే మ‌గ‌ధీర లాంటి ఇండస్ట్రీ హిట్టు కొట్టినా కానీ, ఆ త‌ర్వాత చాలా యావ‌రేజ్ లే. ధృవ‌, రంగ‌స్థ‌లం లాంటి సినిమాలు పడే వ‌ర‌కూ చ‌ర‌ణ్ కి బిగ్ బ్రేక్ ఏదీ లేద‌న్న నిరాశ ఉండేది. అప్ప‌టివ‌ర‌కూ యావ‌రేజ్ ల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చేది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్ కూడా ప‌రిణ‌తితో సాధించుకున్న‌ది. హృతిక్ రోష‌న్ `క‌హోనా ప్యార్ హై`తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి, ఘ‌న‌మైన ఎంట్రీని చాటుకున్నాడు. కానీ చాలా ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయి.

అయితే వీట‌న్నిటికీ భిన్నంగా ఇప్పుడు ఒక డెబ్యూ హీరో కెరీర్ మొద‌టి సినిమాతోనే 300 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెడుతూ అద‌ర‌గొట్టేస్తున్నాడు. అత‌డు హిందీ న‌టుడు చంకీ పాండే న‌ట‌వార‌సుడు అహాన్ పాండే. చంకీ పాండే క్యారెక్ట‌ర్ న‌టుడిగా సుప‌రిచితుడు. సీనియ‌ర్ న‌టుడు చంకీ ఇంత‌కుముందు సాహో చిత్రంలో విల‌న్ గా న‌టించాడు. అత‌డు స‌హాయ‌క న‌టుడిగా చాలా సినిమాల్లో న‌టించినా రాని గుర్తింపును, గౌర‌వాన్ని పాండే కుటుంబానికి తెచ్చాడు అహాన్ పాండే. అత‌డు న‌టించిన సైయారా చిత్రం రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ సినిమా రెండో శుక్రవారం ఏకంగా 18 కోట్లు వ‌సూలు చేసి, 200 కోట్ల క్ల‌బ్ కి చేరువ‌గా వ‌చ్చింది. శ‌ని, ఆదివారాలు సెల‌వు దినాలు కాబ‌ట్టి ఈ చిత్రం 240కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా.

ఈ సినిమా వ‌సూళ్ల దూకుడు చూస్తుంటే మూడో వారంలోను స్థిరంగా కొన‌సాగుతుంద‌ని 300 కోట్ల క్ల‌బ్ లో సునాయాసంగా ప్ర‌వేశిస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. 2025లో చావా త‌ర్వాత బాలీవుడ్ లో బిగ్గెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా సైయారా రికార్డుల‌కెక్కింది. హిందీ బెల్ట్ లో పుష్ప 2, చావా త‌ర్వాత సైయారా చిత్రం చ‌రిత్ర సృష్టించింది. రెండో శుక్ర‌వారం వ‌సూళ్ల‌లోను చావా రికార్డుల‌కెక్కింది. ఈ శ‌నివారం సాయంత్రం దేవ‌ర‌కొండ `కింగ్ డ‌మ్` ఈవెంట్లో సైయారా అంత పెద్ద హిట్టు కొట్టాల‌ని నిర్మాత నాగ‌వంశీ వ్యాఖ్యానించారు అంటే... ఒక డెబ్యూ కి ఇంత‌కంటే ఏం కావాలి?

300 crs for a debut hero:

  Ahaan Panday Saiyaara Crossed 300 Crore Mark   

Tags:   AHAAN PANDAY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ