హరి హర వీరమల్లు బాయ్ కాట్ ట్రెండ్ చేసిన వైసీపీ నేతలకు ఇప్పుడు ఫుల్ హ్యాపీ. కారణం హరి హర వీరమల్లు కు ఆడియన్స్ నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్, క్రిటిక్స్ నుంచి వచ్చిన రివ్యూస్ చూసాక వైసీపీ నేతలు, కార్యకర్తలు కంటినిండా నిద్రపోయి ఉంటారు. తాము సోషల్ మీడియాలో హరి హర వీరమల్లు ను నెగెటివ్ చెయ్యక్కర్లేకుండానే నెగెటివ్ అయ్యింది అని సంబరపడుతున్నారు.
అసలే గతంలో పవన్ తో పెట్టుకుని ఇప్పుడు వైసీపీ నేతలంతా ఇంట్లోనే కూర్చున్నారు. పవన్ ను పదే పదే కించపరిచిన వారికి రాజకీయాల్లో పవన్ కోలుకోలేని దెబ్బ తీశారు. భీమ్లా నాయక్ రిలీజ్ సమయంలో పవన్ ను ప్రత్యేకంగా జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు వీరమల్లుకు కూటమి ప్రభుత్వం రేట్లు పెంచింది.
కానీ హరి హర వీరమల్లు సినిమా జనాలకు నచ్ఛలేదు. ఆ విషయంలో వైసీపీ బ్యాచ్ మొత్తం ఫుల్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ప్లాప్ అంటూ వారు బయటికి ఎలాంటి కామెంట్లు చెయ్యకపోయినా మనసులో మాత్రం తెగ ఆనందపడిపోతున్నారు.