యంగ్ టైగర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటిని రెనోవేషన్ చేయిస్తున్నారనే విషయం తెలిసిందే. కొన్ని చిన్న చిన్న పనులు ఉండడం, అలాగే మరికొన్ని కొత్త హంగులు ఏర్పాటు చేసుకునేలా తన ఇంటిని ఎన్టీఆర్ రెనోవేషన్ చేయిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ తన ఇంటి రెనోవేషన్ పనులు పూర్తి కావడం, అలాగే శ్రావణమాసం ఆరంభం కావడంతో తన ఇంట్లోకి ఫ్యామిలీతో కలిసి సింపుల్ గా వచ్చేశారని..
అదే రోజు ఆయన తన ఇంట్లో ఫ్రెండ్స్ కి చిన్నపాటి ఇచ్చి సెలెబ్రేట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్ తో ఎన్టీఆర్ పార్టీ చేసుకున్న పిక్స్ చక్కర్లు కొడుతూ ఉండడంతో అది ఆయన రెనోవేషన్ ఇంటి లోనే జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ ఇంటి కున్త వాల్ ఫ్రేమ్స్ అలాగే మరికొన్ని లగ్జరీ వస్తువుల కోసం కోట్లు పెట్టినట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్స్ కోసం ముంబై లోనే ఉంటున్నారు. ఆగస్టు 14 న వార్ విడుదల కాబోతుంది. ఆ తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పాల్గొంటారని తెలుస్తుంది.