మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. వార్ 2 విడుదలయ్యేవరకు ఎన్టీఆర్-నీల్ అప్ డేట్ ని ఆశించకూడదని మే 20 నే అంటే ఎన్టీఆర్ బర్త్ డే రోజునే నీల్ చెప్పారు. ఆతర్వాత ఏదో ఒక మంచి ఫెస్టివల్ చూసి నీల్-ఎన్టీఆర్ సర్ ప్రైజ్ ట్రీట్ ని మేకర్స్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
నీల్ చిత్రం కోసం ఎన్టీఆర్ చాలా అంటే దాదాపు 18 కేజీల బరువు తగ్గారు. ఆయన లుక్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ అవుతున్నారు. తాజాగా సలార్ యాక్టర్ పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రశాంత్ నెల్ ఎన్టీఆర్ తో సినిమా పై, అలాగే ఆ సినిమా టైటిల్ పై చేసిన కామెంట్స్ చేసారు.
ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సీనియర్ నటులు బిజూ మీనన్, మరో యంగ్ హీరో టోవినో థామస్ నటిస్తున్నారని తెలిపారు. బిజూ మీనన్, టోవినో థామస్ వారిద్దరికీ ఈ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ ఉంటుందని భావిస్తున్నానని అంటూ ఎవరూ ఊహించిన దానికంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కువగానే ఉంటుందని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.