విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం ఈరోజు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళారు. అక్కడ అభిమానుల సమక్షంలో కింగ్ డమ్ ట్రైలర్ లాంచ్ చెయ్యబోతున్నారు. ఇక్కడ విజయ్ దేవరకొండ డెంగ్యూ ఫీవర్ నుంచి కోలుకోగానే ఆయన కింగ్ డమ్ ప్రమోషన్స్ లో బిజి అయ్యారు. సందీప్ వంగ తో విజయ్ దేవరకొండ-గౌతమ్ చేసిన ఇంటర్వ్యూలో వైరల్ అయ్యింది
తాజాగా విజయ్ దేవరకొండ గత రెండేళ్లుగా ఫ్యామిలీకి గర్ల్ ఫ్రెండ్ కి సమయాన్ని కేటాయించలేకపోతున్నట్లుగా ఈ రెండేళ్లు తనకి నచ్చినట్లుగా ఉండలేకపోతున్నాను అని ఫీలైపోతున్నాడు. మానవ సంబంధాలు అన్నిటికన్నా విలువైనవి. గత రెండేళ్లలో నాకు బంధాల విలువ తెలిసొచ్చింది. రెండుమూడేళ్లుగా నేను జీవించిన లైఫ్ నాకు నచ్చలేదు.
అమ్మ, నాన్న, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ ఇలా ఎవ్వరితో సమయాన్ని గడపలేకపోయాను. నాకు నేనే ఒక రోజు రియలైజ్ అయ్యాను, నన్ను నేను మార్చుకున్నాను. ఇప్పుడు వాళ్లందరితో టైమ్ స్పెండ్ చేస్తున్నాను. కావాల్సినట్టుగా హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నాను అంటూ విజయ్ మాట్లాడిన మాటలు విన్న నెటిజెన్స్.. ఎవరు విజయ్ ఆ గర్ల్ ఫ్రెండ్.. రష్మిక నేనా అంటూ సరదాగా విజయ్ దేవరకొండ ను అడుగుతున్నారు.