Advertisementt

1200కోట్ల కంపెనీని సృష్టించిన న‌టి

Sat 26th Jul 2025 03:26 PM
aashka goradia  1200కోట్ల కంపెనీని సృష్టించిన న‌టి
Rs 1200 crore business empire built by actress 1200కోట్ల కంపెనీని సృష్టించిన న‌టి
Advertisement
Ads by CJ

రియాలిటీ షోలతో పాపుల‌రై, యూట్యూబ్ లో యోగా క్వీన్ గా ప్ర‌పంచానికి ప‌రిచ‌య‌మై, ఆపై ఒక విదేశీ యోగా గురూని పెళ్లాడి ఒక బిడ్డ‌ను కూడా క‌న్న త‌ర్వాత‌, ఆమె ఎదుగుద‌ల చూస్తుంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మార‌దు. కేవ‌లం 50ల‌క్ష‌ల పెట్టుబ‌డితో ఐదేళ్ల‌లో 1200 కోట్ల నిక‌ర‌సంప‌ద‌లు ఉన్న కంపెనీని రూపొందించ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌రం. కానీ ఇది సాధించి చూపించింది ఆష్కా గొరాడియా. నిరంత‌రం యూట్యూబ్ లో భ‌ర్త‌తో క‌లిసి యోగా ఫీట్స్ ని అభిమానుల‌కు ప‌రిచ‌యం చేసే ఆష్కా, ఎంట‌ర్ ప్రెన్యూర్ గాను అజేయంగా దూసుకుపోతున్నారు.

ఓవైపు త‌మ బిడ్డ‌ను రోల్ మోడ‌ల్ గా తీర్చిదిద్దుతూనే ఈ యూట్యూబ‌ర్ కం ఇన్ ఫ్లూయెన్స‌ర్ త‌న సౌంద‌ర్య ఉత్ప‌త్తుల కంపెనీని గొప్ప‌గా అభివృద్ధి చేస్తున్నారు. రెనీ కాస్మోటిక్స్ పేరుతో ఈ సంస్థ 2018లో ఇద్ద‌రు భాగ‌స్వాముల‌తో మొద‌లైంది. 2021లో ఆష్కా గొరాడియా ఆ ఇద్ద‌రితో క‌లిసి పెట్టుబడులు స‌మ‌కూర్చారు. 

ప్రారంభ‌మైన ఏడాదిలోనే ఈ సంస్థ‌ వంద కోట్ల ట‌ర్నోవ‌ర్ కి చేరుకుంది. ఆ త‌ర్వాత కేవ‌లం ఐదేళ్ల‌లోనే 1200-1400 కోట్ల రేంజుకు ఎదిగింది. ఇది నిజంగా ఎంత‌ తెలివైన పెట్టుబ‌డి.. సెల‌బ్రిటీగా ఉన్న‌ప్పుడు త‌న‌కు మేక‌ప్ విభాగం అంటే ఎంతో ఆస‌క్తి. అదే క్ర‌మంలో సౌంద‌ర్య సాధ‌నాలు, ఉత్ప‌త్తుల గురించి తెలుసుకోవ‌డం ప్రారంభించి, దానినే వ్యాపారంగా మ‌లుచుకుంది. ఇప్పుడు ఎదురేలేని ఎంట‌ర్ ప్రెన్యూర్ గా ఆష్కా గొరాడియా ఎదగ‌డం ఆస‌క్తిక‌రం. బిగ్ బాస్ , ఝ‌ల‌క్ దిక్ లాజా, ఖ‌త్రోంకి ఖిలాడీ, నాచ్ బ‌లియే వంటి రియాలిటీ షోల‌తోఆష్కా గొరాడియా పాపుల‌రైంది. నాగిన్, కుసుమ్ వంటి టీవీ సీరియ‌ళ్ల‌లోను న‌టించింది.

Rs 1200 crore business empire built by actress:

Aashka Goradia

Tags:   AASHKA GORADIA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ