ఉస్తాద్ భగత్ సింగ్ బ్యూటీ శ్రీలీల హైదరాబాద్ వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది. గొడుగేసుకుని మరీ శ్రీలీల వర్షంలో దిగిన ఫొటోస్ ని షేర్ చేసింది. మాన్ సూన్ సీజన్ ని ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల అంటూ అప్పుడే నెటిజెన్స్ కామెంట్లు పెట్టేస్తున్నారు. కొద్దిరోజులుగా హైదరాబాద్ ని వరుణ దేవుడు రిలాక్స్ అవ్వకుండా పట్టుకున్నాడు.
చిరు జల్లులతో మొదలైన వర్షం ఇప్పుడు తుఫానుగా మారి ప్రతిరోజూ హైదరాబాద్ ను వరుణదేవుడు ముంచెత్తుతున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కోసం హైదరాబాద్ లోనే ఉన్న శ్రీలీల ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో శ్రీలీల టీచర్ రోల్ ప్లే చేస్తుంది.
అంతేకాదు ఆమె హిందీలోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తూ హడావిడి చేస్తుంది. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో ఆమె నటించిన హిందీ మూవీ విడుదలకు రెడీ అయ్యింది. ఇప్పుడు రణ్వీర్ సింగ్ తో మరో మూవీ చేయబోతుంది అనే వార్త క్రేజీ క్రేజీగా వైరల్ అవుతుంది.