కమల్ హాసన్-శంకర్ ల ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత ఇండియన్ 3 విడుదలపై రకరకాల అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఇండియన్ 2 తో పాటుగా ఇండియన్ 3 షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది, త్వరలోనే విడుదల అన్న శంకర్ కూడా ఇండియన్ 3పై ఇప్పుడు ఎలాంటి కామెంట్స్ చెయ్యడం లేదు. ఇండియన్ 2 డిజాస్టర్, గేమ్ చేంజర్ ప్లాప్ తర్వాత ఇండియన్ 3 విడుదల కాదు అనే మాట వినబడుతూనే ఉంది.
ఇండియన్ 3 ఓటీటీ రిలీజ్ అని ఒకసారి, కాదు ఆగిపోయింది అనే ప్రచారం వేళ ఇండియన్ 3 పై ఇప్పుడొక న్యూస్ సంచలనం సుష్టిస్తుంది. ఇండియన్ సమస్యలోకి సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంటర్ అయ్యారని, ఇండియన్ 3 ని ఎలాగైనా రిలీజ్ చెయ్యాలని లైకా వారు ఆలోచిస్తున్నారు, కానీ దర్శకుడు శంకర్ సహకరించని కారణంగా వారు ఈ పంచాయితిని రజినీకాంత్ వద్దకు తీసుకెళ్లారని తెలుస్తోంది.
రజినీకాంత్ కి లైకా అలాగే కమల్ ఇంకా దర్శకుడు శంకర్ క్లోజ్ కాబట్టి ఇండియన్ 3 పంచాయతీ ఆయన దగ్గరకు వెళ్లగా ఇప్పటికే రజినీకాంత్ తన స్నేహతుడు కమల్ తో మాట్లాడారని.. కమల్ ఇండియన్ 3 మిగతా కొద్దిపాటి షూటింగ్ చేసేందుకు సానూకూలంగా ఉన్నారని, ఇక శంకర్ ఏమన్నారో తెలియదు కానీ ఇండియన్ 3 మేటర్ అయితే సెటిల్ అయ్యింది అని, త్వరలోనే అప్ డేట్ ఉండబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.