Advertisementt

యాంక‌ర్ భ‌ర్త‌పై చీటింగ్ కేసు

Sat 26th Jul 2025 09:21 AM
anchor  యాంక‌ర్ భ‌ర్త‌పై చీటింగ్ కేసు
Anchor యాంక‌ర్ భ‌ర్త‌పై చీటింగ్ కేసు
Advertisement
Ads by CJ

ఈరోజుల్లో మోసం లేనిదే వ్యాపారం లేదు. మోసానికి నా- ప‌ర అనే విభేధం లేదు. అయిన‌వారినే న‌మ్మించి న‌ట్టేట ముంచుతున్న రోజులివి. ఇలాంటి అధునాత‌న ప్ర‌పంచంలో ఒక ప్ర‌ముఖ తెలుగు న‌టుడు స‌హ‌చ‌రుడే అయిన నిర్మాత‌కు లిటిగేష‌న్ లో ఉన్న ఫ్లాట్ ని అమ్ముకుని సొమ్ములు చేసుకోవ‌డం చ‌ర్చ‌గా మారింది. అది లిటిగేష‌న్ ఫ్లాట్ కావ‌డంతో తెలివిగా వ‌దిలించుకునేందుకు స‌ద‌రు నిర్మాత‌ను బుట్ట‌లో వేసాడ‌ని కొంత కాలానికి బ‌య‌ట‌ప‌డింది.

అయితే తెలుగు న‌టుడి నుంచి లిటిగేష‌న్ ఫ్లాట్ ని కొనుగోలు చేసిన స‌ద‌రు నిర్మాత దానిని వేరొక‌రికి అమ్మేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా, అస‌లు వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. అప్ప‌టివ‌ర‌కూ అది లిటిగేష‌న్ ఉన్న ఫ్లాట్ అనే విష‌యం ఆ నిర్మాత‌కు కూడా తెలీదు. ఇప్పుడు ఈ మోసం కేసులో స‌ద‌రు న‌టుడిపై హ‌య‌త్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు చేసార‌ని తెలిసింది. 

రాచ‌కొండ పోలీసులు కేసును విచారిస్తున్నారు. రేపో మాపో స‌ద‌రు న‌టుడు అరెస్ట్ అయ్యేందుకు  అవ‌కాశం ఉందంటూ క‌థ‌నాలొస్తున్నాయి. ప్ర‌ముఖ యాంక‌ర్ భ‌ర్త‌గా సుప‌రిచితుడే అయిన ఈ న‌టుడు ఇటీవ‌ల భార్య నుంచి దూరంగా ఉంటున్నాడ‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. పాపుల‌ర్ న‌ట‌గురువు కుమారుడిగాను అతడు ఇండ‌స్ట్రీకి సుప‌రిచితుడు. త‌మ వార‌సుడిని ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసారు.

Anchor:

Anchor

Tags:   ANCHOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ