నిన్న గురువారం విడుదలైన హరి హర వీరమల్లు చిత్ర మేకర్స్ కి బిగ్ షాకిచ్చారు పైరసీ రాయుళ్లు. పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ఎన్నో సమస్యలను, ఆడ్డంకులు దాటుకుని థియేటర్స్ లో విడుదలైంది. సినిమాకి ఫస్ట్ హాఫ్ కి సూపర్ హిట్ టాక్ రాగా, సెకండ్ హాఫ్ కి ప్లాప్ టాక్ పడింది, అందులోను గ్రాఫిక్ వర్క్ పై క్రిటిక్స్ చీల్చి చెండాడారు. అయినప్పటికి పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ సినిమా ఓపెనింగ్స్ కి హెల్ప్ అయ్యాయి.
అలాంటి భారీ బడ్జెట్ సినిమాని పైరసీ భూతం వెంటాడింది. ప్రస్తుతం హరి హర వీరమల్లు చిత్రం ఇంటర్నెట్ లో హల్చల్ చెయ్యడం మేకర్స్ కి షాకిచ్చింది. పైరసీ రాయుళ్లు వీరమల్లుని కిల్ చేసేందుకు చాలా కష్టపడ్డారు, అంటే వారు వీరమల్లును నెటిజన్లకు అందుబాటులో సెల్ ఫోన్ ఉండే విధంగా తక్కువ MB నుండి GB వరకు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇలాంటి పైరసీ రాయుళ్ళు సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ చేసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఎంతగా ఈ పైరసీపై పోరాడుతున్నా ఈ భూతానికి సంకెళ్లు మాత్రం వేయలేకపోతున్నారు.