పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరి హర వీరమల్లు రిజల్ట్ తో బాగా డిజప్పాయింట్ అయ్యారు. మొదటి నుంచి అంచనాలు పెద్దగా లేని వీరమల్లు చిత్రంలోని గ్రాఫిక్స్ పై వస్తున్న ఫీడ్ బ్యాక్ చూసి హరి హర వీరమల్లు ని చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సినిమా రిజల్ట్ కన్నా పవన్ ఫ్యాన్స్ కు ఆ బాధ ఎక్కువైంది.
అయితే పవన్ ఫ్యాన్స్ మరో రెండు నెలలు ఓపిక పడితే సరి. మళ్లీ మంచి మాస్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ తో పవన్ మళ్లీ థియేటర్స్ లో సందడి చేసేస్తారు. అదేనండి పవన్ ఫ్యాన్స్ కోరుకునే OG కరెక్ట్ గా రెండు నెలల వ్యవధిలో సెప్టెంబర్ 25 న విడుదల కాబోతుంది. దర్శకుడు సుజిత్ ప్రస్తుతం OG పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు.
OG మొదలైనప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ వెయిట్ చేయడమే కాదు పవన్ ఎక్కడ కనిపించినా OG OG అంటూ నానా రచ్చ చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీగా OG మరో రెండు నెలల్లో రాబోతుంది. సో వీరమల్లు రిజల్ట్ విషయం పక్కనపడేసి పవన్ ఫ్యాన్స్ OG కోసం వెయిట్ చేస్తే సరి.