Advertisementt

ఫైనల్లీ ముగిసిన విశ్వంభర షూట్

Fri 25th Jul 2025 05:51 PM
vishwambhara  ఫైనల్లీ ముగిసిన విశ్వంభర షూట్
Vishwambhara Wraps Shoot ఫైనల్లీ ముగిసిన విశ్వంభర షూట్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ విజువల్ వండర్ విశ్వంభరతో అలరించబోతున్నారు. అద్భుతమైన టీజర్, చార్ట్‌బస్టర్ ఫస్ట్ సింగిల్, ప్రమోషనల్ కాంపైన్ తో ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విశ్వంభర ప్రత్యేక పుస్తకం లాంచ్ చేశారు. 

మెగాస్టార్ చిరంజీవి, మౌని రాయ్ పై చిత్రీకరించిన అద్భుతమైన డ్యాన్స్ నంబర్‌తో విశ్వంభర షూటింగ్ గ్రాండ్‌గా పూర్తయ్యింది. ఈ చిత్రం మొత్తం స్కోర్‌ను ఆస్కార్ విజేత MM కీరవాణి కంపోజ్ చేస్తున్నారు. మాస్-అప్పీల్ ట్రాక్‌లతో అలరించే  

భీమ్స్ సిసిరోలియో ఈ హై-ఎనర్జీ డ్యాన్స్ నంబర్‌ను కంపోజ్ చేశారు.

శ్యామ్ కాసర్ల రాసిన ఈ పాట అభిమానులకు ఒక ట్రీట్ గా ఉండబోతోంది. పుష్ప, పుష్ప 2 చిత్రాలలో బ్లాక్ బస్టర్ పాటలకు కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య ఈ పాటకు డ్యాన్స్ కోరియోగ్రఫీ సమకూర్చారు. 100 మంది డ్యాన్సర్స్‌తో ఈ సాంగ్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించారు.  

చిరంజీవి డ్యాన్స్ ఫ్లోర్‌లో తన సిగ్నేచర్ గ్రేస్‌ తో అదరగొట్టారు. మంచి డ్యాన్సర్ అయిన మౌని రాయ్ తనదైన స్పార్క్ ని యాడ్ చేశారు. గ్రాండ్ స్కేల్ లో ఉన్న ఈ పాట విజువల్ వండర్ గా ఉండబోతోంది.

Vishwambhara Wraps Shoot:

Vishwambhara Wraps Shoot With A Thundering Dance Number 

Tags:   VISHWAMBHARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ