నందమూరి బాలకృష్ణ -క్రిష్ కలయికలో గౌతమిపుత్ర శాతకర్ణి తో పాటుగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కింది. ఆ తర్వాత వారి కాంబోలో మరో చిత్రం అన్నారు కానీ.. అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. తాజాగా హరి హర వీరమల్లు రిలీజ్ సందర్భంలో మరోసారి బాలయ్య-క్రిష్ కాంబో తెరపైకి వచ్చింది.
బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఆ చిత్రం ఫినిష్ కాగానే ఇమ్మిడియట్ గా ఆయన గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ లోకి జంప్ అవుతారు. అయితే గోపీచంద్ మలినేని మూవీ తో పాటుగా క్రిష్ తో చేసే ప్రాజెక్ట్ ని కూడా బాలయ్య పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లుగా టాక్.
అది ఆదిత్య 369 కి సీక్వెలా లేదా మరో కొత్త కథ అనేది తెలియాల్సి ఉంది. మరి బాలయ్య తో క్రిష్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కినా అది మంచి క్రేజీ ప్రాజెక్ట్ అవడం ఖాయం. క్రిష్ తెరకెక్కించిన ఘాటీ రిలీజ్ ప్రమోషన్స్ లో బాలయ్య ప్రాజెక్ట్ పై క్రిష్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.