పవన్ కళ్యాణ్ తాను సినిమా షూటింగ్స్ చేసుకోవడానికి సీఎం చంద్రబాబు గారు రోజుకు రెండు గంటల సమయం ఇచ్చారంటూ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో చెప్పారు. ఆ రెండు గంటల సమయానికే పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాల్ని పూర్తి చేసి పడేస్తున్నారు. హరి హర వీరమల్లు షూటింగ్ లకి దిగారో లేదో ఆ సినిమాని ముగించేసిన పవన్ అదే స్పీడు లో OG షూటింగ్ చేసేసారు.
హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్, నేను వీరమల్లు ప్రమోషన్స్ కు గ్యాపిచ్చాను, అందుకే మరో నాలుగు రోజులు లేట్, లేదంటే ఈ మంత్ ఎండ్ కల్లా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఫినిష్ అయ్యేది అని చెప్పడం చూసి ఏంటి పవన్ ఈ స్పీడు, వరసబెట్టి సినిమా షూటింగ్ లు పూర్తి చేస్తున్నారంటూ ఆశ్చర్యపోతున్నారు.
అసలు ఉస్తాద్ భగత్ సింగ్ ఇంత ఫాస్ట్ గా ఫినిష్ అవడమేమిటో జనాలకి అర్ధం కావడం లేదు. హరీష్ శంకర్ గతంలో ఉస్తాద్ కి చాలా తక్కువ రోజులు షూట్ చేసారు. అలాంటిది ఇప్పుడు పవన్ ఓ 40 నుంచి 50 రోజుల కాల్షీట్స్ ఇస్తేనే ఉస్తాద్ షూటింగ్ ఫినిష్ అవుతుంది అనుకుంటే.. ఆయన ఉస్తాద్ సెట్ లో అడుగు పెట్టిన నెలకే షూటింగ్ పూర్తి కావడమేమిటో ఎవరికీ అర్ధం కాకపోయినా.. ఫాన్స్ మాత్రం ఉస్తాద్ షూటింగ్ కూడా ముగింపుకు రావడంతో రిలాక్స్ అవుతున్నారు. అసలే పవన్ బ్రేకిస్తే ఎప్పటికి వస్తారో తెలియదు కదా అందుకే.