దర్శకధీరుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ కలయికలో మోస్ట్ క్రేజీ పాన్ ఇండియా మూవీ అప్ డేట్ ఏది అధికారికంగా రాకపోయినా, మహేష్, రాజమౌళి సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటున్నా అందులో నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ అప్పుడప్పుడు రాజమౌళి తో చేస్తున్న SSMB 29 క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
రాజమౌళి ప్రస్తుతం SSMB 29 కి చిన్న బ్రేక్ ఇచ్చారు. బాహుబలి రీ రిలీజ్ పనుల్లో రాజమౌళి ఉన్నారు. ఈలోపు మహేష్ శ్రీలంక కి ఫ్యామిలీ టూర్ వేసారు. మరోపక్క ప్రియాంకా చోప్రా కుటుంబంతో కలిసి బహ్మాస్ తీరంలో రిలాక్స్ అవుతోంది. మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు.
పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన సర్జమీన్ డైరెక్టర్ ఓటీటీ రిలీజ్ కి రాబోతుంది. ఆ ప్రమోషన్స్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ SSMB 29 పై క్రేజీ కామెంట్స్ చేసారు. ఇప్పటివరకు ఎవరూ తెరకెక్కించని స్థాయిలో ఒక మాస్టర్ పీస్ లా దర్శకుడు రాజమౌళి SSMB 29 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు, ఇలాంటివి తీయడంలో రాజమౌళి సిద్ధహస్తుడని, తమ కలయికలో రూపొందుతున్న ఈ మూవీ అంచనాలకు మించి ఉంటుందని చెప్పడంతో ఈప్రాజెక్టు పై అందరిలో విపరీతమైన క్రేజ్ మొదలైపోయింది.