బాలీవుడ్ లో హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న జాన్వీ కపూర్ కి అక్కడ భారీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ తగలకపోయినా కానీ.. శ్రీదేవి డాటర్ ట్యాగ్ మాత్రం టాలీవుడ్ లో ఆమెకు రెడ్ కార్పెట్ పరిచేలా చేసింది. ఇక్కడ జాన్వీ కపూర్ కు గ్లోబల్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్ లు వచ్చేశాయి.
అమ్మడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో అవకాశాలు పట్టెయ్యడమే కాదు.. పారితోషికంతోను సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సినిమా సినిమాకి ఆమె పారితోషికం పెంచుకుంటూ పోతుంది అనే వార్త ఉష మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్-అట్లీ మూవీలోను జాన్వీ కి ఛాన్స్ రాగా అది పారితోషికం దగ్గర ఆగినట్లుగా తెలుస్తుంది.
ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ లుక్స్ తో రచ్చ చేసే జాన్వీ కపూర్ తాజాగా కార్ లో వెళుతున్న లుక్ వదిలింది. ఆ పిక్ లో జాన్వీ కపూర్ చాలా ఫ్రెష్ గా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఆ పిక్ చూసినవారు సన్ కిసెడ్ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.