సోషల్ మీడియా ప్రపంచంలో, ఆన్ లైన్ లోకంలో స్మార్ట్ ఫోన్ వాడని మనిషి, వాట్సాప్ ని పట్టించుకోని మనిషి ఉంటారా, పల్లెటూరు మొదలు ఫారెస్ట్ ఏరియా వరకు అందరూ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే బ్రతుకుతుంటే ఓ స్టార్ హీరో ఏడాది కాలంగా స్మార్ట్ ఫోన్ ని యూస్ చెయ్యకుండా ఉండడం నిజంగా విచిత్రమే.
ఆయనే మలయాళ హీరో ఫహద్ ఫాసిల్. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో క్రేజీగా మారిన ఫహద్ ఫాసిల్ తాజాగా తమిళ స్టార్ కమెడియన్ వడివేలు తో కలిసి నటించిన మారీశన్ ప్రమోషన్స్ లో భాగంగా రజినీకాంత్ వేట్టయ్యన్ మూవీలో బ్యాటరీ పాత్రలో ఎందుకు నటించాడో అనేది రివీల్ చేశారు. వెట్టయ్యన్ లో తనకు మరో పాత్ర ఇచ్చారని, కానీ తను కావాలనే బ్యాటరీ కేరెక్టర్ ఎంచుకోగా దానికి డైరెక్టర్ చాలా మార్పులు చేయరని చెప్పారు.
అయితే తను ఏడాది కాలంగా స్మార్ట్ ఫోన్ వాడడం లేదు అని, తన దగ్గర చిన్న ఫోనే ఉందని, తనకు వాట్సాప్ లేదని, సినిమాలకు సంబందించిన కథలను, ప్రతి అప్ డేట్ మెయిల్ ద్వారానే తెలుసుకుంటానని, ఒకప్పుడు సోషల్ మీడియా ఉపయోగించేవాడిని, అది కూడా కెరీర్ కోసమే అంటూ ఫహద్ ఫాసిల్ సోషల్ మీడియాను, వాట్సాప్ ను వాడని విషయాన్ని రివీల్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.