హరి హర వీరమల్లు పార్ట్1 నిన్న గురువారం విడుదలైంది. హరి హర వీరమల్లు పార్ట్ 1 చిత్రానికి ఆడియన్స్ నుంచి టాక్ ఎలా ఉన్నా క్రిటిక్స్ నుంచి డిజాస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. పూర్ విఎఫెక్స్ హరి హర వీరమల్లు ను కిల్ చేసింది అనే మాట ఆడియన్స్ నోటా, సినీవిమర్శకుల నుంచి ఎక్కువగా వినబడుతుంది.
ఫస్ట్ హాఫ్ నీట్ గా సాగిన హరి హర వీరమల్లు సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పింది, పవన్ కళ్యాణ్ గుర్రం పైన సీన్స్, ఇలా చాలావరకు గ్రాఫిక్ వర్క్ కారణంగా సినిమాకి డ్యామేజ్ అయ్యింది. క్రిష్ పూర్తి ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసి ఉంటే బావుండేది అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరి హరి హర వీరమల్లు పార్ట్ 1 పరిస్థితి ఇలా ఉంటే.. పార్ట్ 2 ఉంటుందా..
ఈ అనుమానాలను చాలామంది నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్ట్ 1 నే ఐదేళ్లకు పైగా పూర్తి చేసారు. పార్ట్ 2 కి డేట్స్ కి ఇస్తారా, అసలు పార్ట్ 2పై ఎలాంటి క్రేజ్ ఉంటుంది, పార్ట్ 1 హిట్ అయితే పార్ట్2 పై ఎంతోకొంత అంచనాలు ఉండేవి, వీరమల్లు పార్ట్ 1 కొస్తున్న టాక్ చూస్తే మండే కి దుకాణం సర్దేయడం ఖాయం అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
చూద్దాం హరి హర వీరమల్లు మేకర్స్ పార్ట్ 2పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, దానికి పవన్ ఏమంటారో అనేది.!