జనసేన పార్టీ పెట్టిన పదేళ్లకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. 2024 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున నిలబెట్టిన అభ్యర్డులందరిని గెలిపించుకోవడమే కాదు ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పలు శాఖల బాధ్యతలు నిర్వహిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
మరి రాజకీయాల్లో సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల్లో కూడా హిట్ కొట్టి సక్సెస్ అవుతారా అని ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు జులై 24 గురువారం విడుదల కాబోతుంది. హరి హర వీరమల్లు కూడా విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ అక్కడ అంటే రాజకీయాల్లోనూ, ఇక్కడ అంటే సినిమాల్లో కూడా సక్సెస్ అయినట్టే.
హరి హర వీరమల్లు పై ఎంత హైప్ ఉందొ అనేది రేపటి ఓపెనింగ్స్ చూస్తే కానీ క్లారిటీ రాదు. రెండు కరోనా వేవ్స్, మరికొన్ని టెక్నీకల్ రీజన్స్, అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం ఇవన్నీ హరి హర వీరమల్లు చిత్రం విడుదలకు లేట్ అవుతూ వచ్చింది. మరి సినిమాపై క్రేజ్ ఎంతుందో అనేది మరికొన్ని గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది.