పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం రేపు గురువారం పాన్ ఇండియా మూవీ గా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే బెంగుళూరులో కొంతమంది కన్నడీగులు హరి హర వీరమల్లు పోస్టర్స్ చించివేయడం హాట్ టాపిక్ అయ్యింది.
బెంగళూరు లో హరి హర వీరమల్లు బ్యానర్లు చింపి పారెయ్యడంతో.. తెలుగు సినిమాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ మితిమీరుతున్న కొంతమంది కన్నడిగులు పై తెలుగు వారు ఫైర్ అవుతున్నారు.
దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అదే కన్నడలో తెరకెక్కిన KGF పార్ట్ 1, పార్ట్ 2, కాంతార లాంటి చిత్రాలను తెలుగు వాళ్ళు వ్యతిరేకించి ఉంటే కన్నడ సినిమాలకు భవిష్యత్తు ఉండేదా అంటూ తెలుగు వారు ఫైర్ అవుతున్నారు.