ఇప్పటివరకు హరి హర వీరమల్లు మూవీ పై ఎంత బజ్ ఉంది, ఏ రేంజ్ లో వీరమల్లు పై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది అనే విషయంలో మేకర్స్ కి మాత్రమే కాదు పవన్ ఫ్యాన్స్ లోను విపరీతమైన అనుమానాలున్నాయి. కారణం సినిమా రిలీజ్ వాయిదా ల మీద వాయిదాలు పడడం, అలాగే షూటింగ్ నత్తనడకన సాగుతూ ఏళ్ళ తరబడి సెట్ పైనే ఉండడం.
దానితో హరి హర వీరమల్లు విషయంలో పవన్ ఫ్యాన్స్ కే నమ్మకం పోయి వారు OG మీద పడ్డారు. పవన్ ఎక్కడ కనిపించినా వీరమల్లుని వదిలేసి OG నామ జపం చెయ్యడంతో వీరమల్లు పై అనుమానాలు బలపడ్డాయి. పవన్ కూడా OG తర్వాత, ముందు వీరమల్లు అంటూ ఫ్యాన్స్ కు నచ్చజెప్పారు. అయితే హరి హర వీరమల్లు విడుదలకు ముందు అందరి అనుమానాలు తొలిగిపోయేలా వీరమల్లు టికెట్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి.
హరి హర వీరమల్లు బెన్ ఫిట్ షోస్ తోనే సంచలనం సృష్టించబోతుంటే.. రేపటినుంచి అందులోను వీక్ మిడిల్ గురువారం హరి హర వీరమల్లు బుకింగ్స్ చూస్తే మతిపోతుంది. మొదట ఏపిలో బుకింగ్స్ ఓపెన్ అయిన వీరమల్లు కు ఎట్టకేలకి నైజాంలో కూడా విడుదల అయ్యి, ప్రీమియర్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో స్టార్ట్ అయ్యాయి.
హరి హర వీరమల్లు టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయని చెప్పాలి. ఈ బుకింగ్స్ స్టేటస్ చూసి మేకర్స్ షాకైపోతున్నారు. ఈ రేంజ్ లో వీరమల్లు బుకింగ్స్ ని వారు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.