ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ - నారా లోకేష్ ల నడుమ అన్నదమ్ముల బంధం కనిపిస్తుంది. నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కు పెద్దన్న స్థానం ఇస్తున్నారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ నడుమ సన్నిహిత సంబందాలు నడుస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రేపు గురువారం విడుదల కాబోతుంది.
పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా..
మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటూ నారా లోకేష్ మీడియా వేదికగా వేసిన ట్వీట్ వైరల్ మారింది.